Vikas Raj : మునుగోడులో ఈసీ గైడ్‌లైన్స్ కంటే ఎక్కువనే నిఘా టీంలు పెంచాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక మేనియా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ఈ ఉప ఎన్నికపై రాష్ట్ర ప్రజలే కాకుండా జాతీయ రాజకీయాలు సైతం దృష్టి సారించాయి. అయితే.. నేడు మునుగోడు పరిస్థితులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చండూర్లో స్టాంగ్ రూముల్లో ఈరోజు బ్యాలెట్ పేపర్లు.. ఈవీఎంల తీరును పరిశీలించామన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించాను.. పోలీస్ స్టేషన్ల పరిశీలించాను అక్కడున్న ప్రజలతో మాట్లాడాను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నాను అన్ని బాగానే ఉన్నాయని తెలిపారు. ఈ సారి 47 మంది అభ్యర్థులు ఉండడంతో ఈవీఎంస్ పెట్టాల్సి ఉంది వారికి ఎన్నికల సిబ్బంది శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీరును పరిశీలించాను. మునుగోడు నియోజకవర్గంలో ఈసీ గైడ్‌లైన్స్ కంటే ఎక్కువనే నిఘా టీములు పెంచాం. పోలీసుల బందోబస్తు కూడా పెంచం.. కేంద్ర బలగాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
Also Read : Talasani Srinivas Yadav : కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారానికి మునుగోడు ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారు
కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని అందుబాటులో ఉంచాము ఇది 24 గంటలపాటు పని చేస్తోంది. ప్రత్యేక కాల్ సెంటర్ కూడా పెట్టారు అవకతవకులు జరిగిన నిబంధనలు ఉల్లంఘిస్తున్న అంశం ఉన్న ఈ కాల్ సెంటర్ కి ఫోన్ చేయొచ్చు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ మంది సిబ్బందిని పెంచాలని ఆదేశాలు జారీ చేశాము.. బెల్టుషాపుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించాము. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలాగా అన్ని చర్యలు తీసుకున్నాం. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే ఆర్ ఓ పైన అలాగే మరో తాసిల్దారు పైన చర్యలు తీసుకున్న ఎవరు కూడా ఈజీగా తీసుకోవద్దని ఎన్నిక సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశాము. డబల్ ఎన్రోల్మెంట్ ఉన్న వాళ్ళే ఓట్లు కొన్ని తొలగించి ఉంటారు ఇప్పుడు కొత్త నమోదు సాధ్యం కాదు. గుర్తుల మీద క్లారిటీ లేదు అనేదానిలో నిజం లేదు ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకే గుర్తుల ప్రింటింగ్ జరిగింది అని ఆయన వివరించారు.
Also Read
- Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
- Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్‌కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
- Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
తాజావార్తలు
-
The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
-
Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Campa Cola vs Coca-Cola: ‘కోలా వార్’లో కొత్త మలుపు.. అంబానీ ‘క్యాంపా’ దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
-
CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
-
Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్‌కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!