NTV Telugu Site icon

Vikas Raj : మునుగోడులో ఈసీ గైడ్‌లైన్స్‌ కంటే ఎక్కువనే నిఘా టీంలు పెంచాం

Vikas Raj

Vikas Raj

మునుగోడు ఉప ఎన్నిక మేనియా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ఈ ఉప ఎన్నికపై రాష్ట్ర ప్రజలే కాకుండా జాతీయ రాజకీయాలు సైతం దృష్టి సారించాయి. అయితే.. నేడు మునుగోడు పరిస్థితులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చండూర్‌లో స్టాంగ్ రూముల్లో ఈరోజు బ్యాలెట్ పేపర్లు.. ఈవీఎంల తీరును పరిశీలించామన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించాను.. పోలీస్ స్టేషన్ల పరిశీలించాను అక్కడున్న ప్రజలతో మాట్లాడాను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నాను అన్ని బాగానే ఉన్నాయని తెలిపారు. ఈ సారి 47 మంది అభ్యర్థులు ఉండడంతో ఈవీఎంస్ పెట్టాల్సి ఉంది వారికి ఎన్నికల సిబ్బంది శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీరును పరిశీలించాను. మునుగోడు నియోజకవర్గంలో ఈసీ గైడ్లైన్స్ కంటే ఎక్కువనే నిఘా టీములు పెంచాం. పోలీసుల బందోబస్తు కూడా పెంచం.. కేంద్ర బలగాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

Also Read : Talasani Srinivas Yadav : కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారానికి మునుగోడు ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారు
కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని అందుబాటులో ఉంచాము ఇది 24 గంటలపాటు పని చేస్తోంది. ప్రత్యేక కాల్ సెంటర్ కూడా పెట్టారు అవకతవకులు జరిగిన నిబంధనలు ఉల్లంఘిస్తున్న అంశం ఉన్న ఈ కాల్ సెంటర్ కి ఫోన్ చేయొచ్చు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ మంది సిబ్బందిని పెంచాలని ఆదేశాలు జారీ చేశాము.. బెల్టుషాపుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించాము. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలాగా అన్ని చర్యలు తీసుకున్నాం. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే ఆర్ ఓ పైన అలాగే మరో తాసిల్దారు పైన చర్యలు తీసుకున్న ఎవరు కూడా ఈజీగా తీసుకోవద్దని ఎన్నిక సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశాము. డబల్ ఎన్రోల్మెంట్ ఉన్న వాళ్ళే ఓట్లు కొన్ని తొలగించి ఉంటారు ఇప్పుడు కొత్త నమోదు సాధ్యం కాదు. గుర్తుల మీద క్లారిటీ లేదు అనేదానిలో నిజం లేదు ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకే గుర్తుల ప్రింటింగ్ జరిగింది అని ఆయన వివరించారు.