Site icon NTV Telugu

CEO Vikasraj: 85 ఏళ్ళు పైబడిన వారికి హోమ్ ఓటింగ్..

Vikas Raj

Vikas Raj

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఈసీఐ ఆదేశాలు ప్రకారం 85 ఏళ్ళు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. హోమ్ ఓటింగ్ కోసం ఫామ్ ‘డి’ దరఖాస్తులు తీసుకుంటున్నామని పేర్కొ్న్నారు. మరో మూడు రోజుల్లో హోమ్ ఓటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్వో దగ్గరే పోస్టల్ ఓట్ అప్లికేషన్లు ఉంటాయని సీఈఓ వికాస్ రాజ్ చెప్పారు.

Read Also: Virat Kohli: ఆర్సీబీ టీమ్తో జతకట్టిన కోహ్లీ.. ప్రాక్టీస్ స్టార్ట్ చేసేశాడుగా..

ఆర్వో, డిఇఓ, పోలీస్ అధికారులకు ఢిల్లీలో శిక్షణ ఇచ్చామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, సెక్టోరల్ స్థాయిలో కూడా శిక్షణ ఇచ్చామన్నారు. మరికొంతమందికి శిక్షణ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. తెలంగాణలో 1,85,612 పోలింగ్ సిబ్బందిని నియమించాము.. 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. 71,968 బ్యాలెట్ యూనిట్లు, 49,692 కంట్రోల్ యూనిట్లు, 54,353 వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

Read Also: Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం..

లోక్‌సభ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వికాస్ రాజ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఉప ఎన్నికల్లో 500 బీయూ, 500సీయూ, 500 వీవీ ప్యాట్ లు అవసరమని తెలిపారు. 1080 పోలింగ్ సిబ్బంది అవసరం ఉంటుంది.. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లవద్దని తెలిపారు. అంతకంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే సరైన పత్రాలు ఉండాలని పేర్కొ్న్నారు.

Exit mobile version