NTV Telugu Site icon

Vikas Raj : మునుగోడులో ప్రతి గ్రామంలో తనిఖీలు చేస్తున్నాం

Vikas Raj Munugode

Vikas Raj Munugode

మునుగోడు ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. అయితే నిన్నటితో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. దీంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు మునుగోడు నియోజకవర్గాన్ని ఆధీనంలోకి తీసుకన్నారు. మునుగోడులో స్థానికేతరులను ప్రచారం ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గంలో ఉండకూడదని ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి నియోజకవర్గంలో ఎవరైనా ఉంటి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలోనే వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తనిఖీలు చేస్తున్నామన్నారు.
Also Read : Complaint to PMO: నారీ శక్తి అంటే ఇదేనా?.. భార్య కొడుతోందంటూ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు

అంతేకాకుండా.. కల్యాణ మండపాలతో సహా అన్నింటినీ చెక్‌ చేస్తున్నామని వివరించారు. పోలింగ్‌ సామాగ్రి పంపిణీ సజావుగా సాగుతోందని, ఇప్పటి వరకు రూ.8 కోట్లను సీజ్‌ చేశామన్నారు. నిన్నటి ఘటనపై కేసు పెట్టామని, ఉదయం 5.30కల్లా ఏజెంట్లు పోలింగ్‌ కేంద్రాలకు రావాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేస్తామన్నారు. అయితే.. రేపు ఉదయం 7 గంటలకు మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ఉప ఎన్నిక కోసం 298 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు జరుగనుంది.