Site icon NTV Telugu

Vikas Raj : ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీల్లో ప్రసారం చేయొద్దు

Vikas Raj

Vikas Raj

మరో గంటలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ముగుస్తుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. మిగతా 106 నియోజకవర్గంలో 6 గంటల తర్వాత ప్రచారం ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తారని ఆయన వెల్లడించారు. ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీల్లో ప్రసారం చేయొద్దని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బల్క్ sms లు నిషేధమని, జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధమని సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సంస్థలు 13వ తేది వేతనంతో కూడిన సెలవు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు.

 

ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, లాడ్జీలలో స్థానికేతరులు ఉండకూడదన్నారు వికాస్‌ రాజ్‌. చెక్ పోస్టుల వద్ద అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, దినపత్రికల్లో రాజకీయ ప్రకటనలకు ఈసీ అనుమతి తీసుకోవాలని, 160 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. 20 వేల పోలీసు కానిస్టేబుల్స్ ఇతర రాష్టాల నుంచి బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు సీఈవో వికాస్‌ రాజ్‌. ఓటర్లు గందరగోళంకు గురి కాకుండా పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోస్టర్లు చూసుకోవాలని ఆయన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోసం 3 లక్షల మంది ఉద్యోగులను నియమించామని, ఇప్పటి వరకు 320 కోట్ల నగదు, లిక్కర్, డ్రగ్స్ సీజ్ చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 35809 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు వికాస్‌ రాజ్‌.

 

Exit mobile version