NTV Telugu Site icon

All Party Meeting: నేడు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు.. రేపటి నుంచి బడ్జెట్ సెషన్స్..

All Paty Meeting

All Paty Meeting

17వ లోక్‌సభ చివరి సమావేశాలు రేపటి (జనవరి 31)నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నేటి ఉదయం 11.30 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచారం ఇచ్చింది. ఈ భేటీలో సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది.

Read Also: Honey Rose: బంఫర్ ఆఫర్ కొట్టేసిన హనీ రోజ్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?

ఇక లోక్‌సభ చివరి సమావేశాలు రేపటి (జనవరి 31న) నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. నెల 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఇప్పటికే ప్రకటించారు. 17వ లోక్‌సభ గడువు జూన్‌ 16న ముగియనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇవే చివరి పార్లమెంట్‌ సమావేశాలు. దీంతో కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ పైనే ఎక్కువ నజర్ పెడుతున్నట్లు టాక్. ఏప్రిల్‌ నుంచి మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది.

Read Also: APPSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు..

అయితే, పార్లమెంటు సమావేశాలకు ముందు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసే సంప్రదాయం చాలా ఏళ్లుగా వస్తుంది. ప్రభుత్వ అజెండాను విపక్షాలకు వివరించడంతో పాటు తాము లేవనెత్తే అంశాలను విపక్షాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నాయి. ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఈసందర్భంగా కొత్తగా తీసుకు వచ్చిన భద్రతా ఏర్పాట్లను అన్ని పార్టీలకు కేంద్ర ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది.