Site icon NTV Telugu

Ayushman Bharat: ఆయుష్మాన్‌ భారత్‌ నమోదుపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

Ayushman Bharat

Ayushman Bharat

Ayushman Bharat: 70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్‌ భారత్ వర్తింపజేయనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా అర్హులైన వారి పేర్లను నమోదు ప్రక్రియను చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ల సిటిజన్ల పేర్ల నమోదు కోసం మొబైల్ యాప్, వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్‌ఎస్ చాంగ్‌సన్ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. మొబైల్‌ యాప్, వెబ్‌ పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్న అర్హులందరీకి ప్రత్యేకంగా ఆయుష్మాన్‌ కార్డులు జారీ చేస్తామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పథకం కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని తెలిపింది.

Read Also: Mthun Chakraborty : లెజండరీ యాక్టర్.. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Exit mobile version