NTV Telugu Site icon

Amaran Movie Meets Rajnath Singh: కేంద్రమంత్రిని కలిసిన అమరన్ మూవీ టీమ్.. అభినందల వెల్లువ

Amaran

Amaran

Amaran Movie Meets Rajnath Singh: హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా అమరన్. నిజజీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా చూసి తాము ఎంతో ఎమోషనల్ అయ్యామని చాలామంది సోషల్ మీడియా ద్వారా వారి భావాలను పంచుకున్నారు. ఇక మరోవైపు ఈ సినిమా చూసి ఏకంగా భారతదేశ కేంద్రమంత్రి రాజనాద్ సింగ్ సినిమా సభ్యులను అభినందించారు. ఈ విషయాన్ని సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Puspa 2 Movie Event: ముంబైలో స్టేజి పైనే రెచ్చిపోయిన ఐకాన్ స్టార్, నేషనల్ క్రష్

న్యూఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాద్ సింగ్ నివాసంలో అమరన్ చిత్ర నిర్మాత ఆర్ మహేంద్రన్‌, దర్శకుడు రాజ్ కుమార్ హీరో శివ కార్తికేయన్ లు ఆయనను కలిశారు. ఇక అమరన్ సినిమా చూసిన కేంద్రమంత్రి చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ చేసిన సేవలను, అలాగే భారత సైన్యం సంబంధించి దేశభక్తి, వీరత్వాన్ని చూపించడం పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ చిత్రంలో భాగమైన కమలహాసన్ విదేశాల్లో ఉండడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయితే భారతీయ సైన్యం నిరంతర మద్దతు సహకారం కోసం గౌరవ మంత్రికి అభినందనలు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని మూవీ టీంతో పాటు రిటైర్డ్ కల్నల్ వినోద్ శరవన్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments