NTV Telugu Site icon

Krishna River: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం

Andhrapradesh

Andhrapradesh

Krishna River: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల సమావేశాన్ని కేంద్ర జల శక్తి శాఖ చేపట్టనుంది. ఈ నెల 6న వర్చువల్‌గా అధికారులు భేటీ కానున్నారు. కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు.

Read Also: Pawan Kalyan: ఆ రెండు భావజాలాలు నాకు ఇష్టం.. ఒక తాటిపైకి తేవాలన్నదే నా ఉద్దేశం

ఇదిలా ఉండగా.. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో ఇవాళ వీడియో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వర్చువల్‌గా ఏపీ సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ హాజరుకాలేదు. ఇవాళ హాజరు కాలేనని, ఈ నెల 5న సమావేశం నిర్వహించాలని తెలంగాణ సీఎస్ కోరారు. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం చేపట్టనుంది. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని కేంద్ర కార్యదర్శి ముఖర్జీ సూచించారు. నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈ నెల 4న కేఆర్‌ఎంబీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీకి కేంద్ర కార్యదర్శి సూచించారు. అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని ఆదేశించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను ఏపీ సీఎస్ వివరించారు.