NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీకి కేంద్రం శుభవార్త.. గోదావరి పుష్కరాలకు భారీగా నిధులు

Pushkaralu

Pushkaralu

ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2027లో జరగనున్న గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.

Read Also: IND vs BAN: ఉప్పల్‌లో మ్యాచ్.. స్టేడియం వద్ద భారీ బందోబస్తు

తూర్పుగోదావరి జిల్లాకు గోదావరి పుష్కరాలు నిర్వహించడం కోసం 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయింపులు జరిగాయి. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించారు. ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మరోవైపు.. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నివేదిక రూపొందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

Read Also: Agniveers: ఫైరింగ్ ప్రాక్టీస్‌లో విషాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి..