Site icon NTV Telugu

NDRF Funds: తెలంగాణకు అదనంగా రూ. 231.75 కోట్ల కేంద్ర నిధులు

Revanthreddy Amitshah

Revanthreddy Amitshah

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ నిధి (NDRF) నిధులను ఇవ్వనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా బుధవారం ఈ నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల కానున్నాయి. ఇందులో తెలంగాణ వాటా కింద రూ.231.75 కోట్లు అందనున్నాయి. గతేడాది ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన ఎన్‌బీఆర్ఎఫ్ నిధులకు.. అదనంగా ఈ నిధులు అందనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు రూ.608.08 కోట్లు, నాగాలాండ్ కు రూ.170.99 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, త్రిపురకు రూ.288.93కోట్లు కేటాయిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ నిర్ణయం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాకి ధన్యవాదాలు తెలియజేశారు.

READ MORE: Andhra Pradesh: మంత్రుల పేషీల్లో ఫేక్‌ నియామకాలు..! వెలుగులోకి సంచలన విషయాలు..

Exit mobile version