Site icon NTV Telugu

Swachh Survekshan: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట

Ap Govt

Ap Govt

Swachh Survekshan: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట పండింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీలలో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. ఆల్ ఇండియా లెవెల్లో నాలుగు ర్యాంకులను ఆంధ్రప్రదేశ్‌ కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో గుంటూరుకి ఆలిండియా 2వ ర్యాంకు, గ్రేటర్ విశాఖ పట్నంకి ఆలిండియా 4వ ర్యాంక్ , విజయవాడకి ఆలిండియా6వ ర్యాంక్ , తిరుపతికి ఆలిండియా8వ ర్యాంకు వచ్చింది. అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకు గానూ ఏపీ ఈ అవార్డులను దక్కించుకుంది.

Read Also: YSRCP: పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై వైసీపీ కసరత్తు

పట్ణణాల అభివృద్ధికి సీఎం జగన్‌ చేస్తున్న కృషికి ఈ అవార్డులే నిదర్శనమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “స్వచ్ఛ సర్వేక్షణ్- 2023 లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీలలో ఏపీ నెంబర్ వన్ గా నిలిచింది. జాతీయ స్థాయిలో గుంటూరుకి ఆలిండియా 2వ ర్యాంకు, గ్రేటర్ విశాఖ పట్నంకి ఆలిండియా 4వ ర్యాంక్ , విజయవాడకి ఆలిండియా6వ ర్యాంక్ , తిరుపతికి ఆలిండియా8వ ర్యాంకు వచ్చింది. పులివెందుల మున్సిపాలిటీకి క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ అవార్డు వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డులు చిహ్నం. సీఎం వైఎస్ జగన్ క్లీన్ ఏపీ (క్లాప్) ప్రోగ్రాం సక్సెస్ అయ్యింది. తడి, పొడి చెత్తను సమర్ధంగా నిర్వహణ జరుగుతోంది.” అని మంత్రి తెలిపారు.

Exit mobile version