Site icon NTV Telugu

Andhra Pradesh: గుడ్‌న్యూస్.. రూ.1,121.20 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల..

Central Government

Central Government

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ విడుదల చేసింది. ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,121.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% కేటాయించింది. 2024-25 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. జనాభా ఆధారంగా గ్రామీణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలల్లో పంచాయతీరాజ్‌శాఖ జమ చేయనుంది.

READ MORE: AP Govt: మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఏపీ పాకిస్థానీయులకు సర్కార్ హెచ్చరికలు..

Exit mobile version