NTV Telugu Site icon

Central Government Jobs: ఉద్యోగాల జాతర.. ఏకంగా 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

Central Government Jobs 2024

Central Government Jobs 2024

Central Government Jobs 2024: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. పది, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ ఇలా చదువు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇక వీటి వివరాల్లోకెళ్తే..

* స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్ పరీక్ష-2024 ( SSC CGL 2024 )కు సంబంధించిన నోటిఫికేషన్‌ ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-B, గ్రూప్-C విభాగాల్లోని 17,727 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే టైర్-1, టైర్-2 పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://ssc.nic.in/ ను సంప్రదించండి.

Bandi Sanjay : కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?

* 2025-2026 సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (CRP)- XIV కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ఏకంగా పలు బ్యాంక్స్ లో 6128 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌ విధానంలో జులై 1వ తేదీ – 21 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://www.ibps.in/ సైట్ ను విజిట్ చేయండి.

Xiaomi Redmi K70 Ultra: అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైల్‭ను తీసుకొచ్చిన షియోమీ..

* ఇక అత్యధికంగా భారత తపాలా శాఖ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఏకంగా 44,228 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ లో ఆంధ్రప్రదేశ్‌- 1,355, తెలంగాణ- 981 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in/ సైట్ ను విజిట్ చేయండి.

London: ఎయిర్‌పోర్టులో అమానుషం.. ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యకాండ

^కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించి విభాగాలలోని కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC MTS 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 8,326 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులే. పూర్తి వివరాలకు https://ssc.gov.in/ సైట్ ను విజిట్ చేయండి.