Site icon NTV Telugu

Central Government Jobs: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?

Job Vacancy

Job Vacancy

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వం సంస్థల్లో ఖాళీలు ఉన్న పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 20 ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల నియామకాన్ని చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

అర్హత, ఆసక్తి కలిగిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అభ్యర్ధులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్.సి, ఎస్టీలకు 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.. అంటే ఒక్కో పోస్ట్ కు ఒక్కో వయస్సు..

ఇకపోతే అభ్యర్థుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు వేతనంగా 40,000ల నుండి 1,40,000వరకు చెల్లిస్తారు. 25/09/2023 నుండి 29/09/2023 వరకు ఇంటర్వ్యూ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ ప్రక్రియ జరిగే ప్రదేశం చిరునామా ; మేనేజర్ (HR), MRVC కార్పొరేట్ ఆఫీస్, 2వ అంతస్తు, చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ బిల్డింగ్, ముంబై 400020… ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. వెబ్ సైట్ ; https://mrvc.indianrailways.gov.in ను సందర్శించగలరు.. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కన్నా ఈసారి ఎక్కువ జాబ్స్ ను భర్తీ చెయ్యనున్నారు..

Exit mobile version