Site icon NTV Telugu

Windfall Tax: చమురు కంపెనీలకు మరో ఝలక్.. క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు

Brent Crude Oil Price,

Brent Crude Oil Price,

Windfall Tax: కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ పన్నును పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు టన్ను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెరిగింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 30 నుండి అంటే శనివారం నుండి అమలులోకి వచ్చాయి. అదే సమయంలో డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో లీటరుకు రూ.5.50 నుంచి రూ.5కి తగ్గింది. ఇది కాకుండా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించి రూ.3.50 నుంచి రూ.2.50కి తగ్గింది. పెట్రోల్ పై ఎలాంటి విండ్ ఫాల్ ట్యాక్స్ విధించబోమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Read Also:Mercantile Bank Ceo: క్యాబ్ డ్రైవర్ ఖాతాలోకి రూ.9000 కోట్లు.. బ్యాంక్ సీఈవో రాజీనామా

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15, 2023న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని సమీక్షించింది. ఇందులో ముడిచమురుపై టన్నుకు రూ.6,700 నుంచి రూ.10,000కు విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం పెంచింది. అదే సమయంలో డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని రూ.6 నుంచి రూ.5.50కి తగ్గించారు. ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై పన్నును లీటరుకు రూ.4 నుంచి రూ.3.50కి తగ్గించారు.

Read Also:Rules Ranjan : సెన్సార్ పూర్తి చేసుకున్న రూల్స్ రంజన్..

విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి?
జూలై 1, 2022న మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, ఎటిఎఫ్‌పై లీటరుకు రూ.6, డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ.13 చొప్పున ఎగుమతి సుంకాన్ని విధించింది. దేశీయ క్రూడాయిల్ విక్రయాలపై టన్నుకు రూ.23,250 విండ్ ఫాల్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించారు. చమురు కంపెనీల లాభాలపై ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తుందని గుర్తుంచుకోండి. ఈ కారణంగా ఎక్కువ లాభాలను ఆర్జించడానికి, చమురు కంపెనీలు భారతదేశంలో కాకుండా విదేశాలలో చమురును విక్రయించకుండా తప్పించుకుంటాయి. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 15 రోజులకు విండ్ ఫాల్ ట్యాక్స్ ను సమీక్షిస్తుంది.

Exit mobile version