NTV Telugu Site icon

AP and Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం.. రూ.3,300 కోట్లు విడుదల

Floods

Floods

AP and Telangana: భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.3, 300 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఇదిలా ఉండగా..తాజాగా తెలంగాణ సెక్రటేరియట్‌లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.

Read Also: Union Minister Ram Mohan Naidu: ఆ రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే బెజవాడ వరద సహాయంపై కేంద్రం నిర్ణయం..

Show comments