NTV Telugu Site icon

Delhi: జమాతే ఇస్లామీపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన

Home

Home

జమ్మూ కాశ్మీర్‌లోని జమాతే ఇస్లామీపై (Jamaat-e-Islami) కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థపై విధించిన నిషేధంపై తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. జమాతే ఇస్లామీ చట్టవిరుద్ధమైన సంఘంగా గతంలోనే పరిగణించింది. ఈ సంస్థపై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ మంగళవారం కేంద్ర హోంశాఖ (Central government) ప్రకటన విడుదల చేసింది.

దేశం యొక్క భద్రత, సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో ఫిబ్రవరి 28, 2019న చట్టవిరుద్ధమైన సంఘంగా కేంద్రం ప్రకటించింది. తాజాగా మరోసారి ఆ సంస్థపై నిషేధాన్ని పొడిగించింది.

జమాతే ఇస్లామీ అనేది ఒక సామాజిక, మతపరమైన సంస్థ. ఇది 1945లో స్థాపించబడింది. ఈ సంస్థకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ సంస్థ భారతదేశ సమగ్రతకు భంగం కలిగించేలా కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న కారణంతో జమాతే ఇస్లామీ చీఫ్‌ సహా 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కూడా అదే వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోసారి ఐదేళ్ల పాటు ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది.

Show comments