DA Hike 2026: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త వేతన సవరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. 8వ వేతన సంఘం నిబంధనలు అధికారికంగా జనవరి 1, 2026 నుండి అమలులోకి రావాల్సి ఉంది. అయితే, కమిషన్ తన నివేదికను సిద్ధం చేయడానికి సుమారు 18 నెలల సమయం పట్టవచ్చు. అప్పటి వరకు ఉద్యోగులకు పాత (7వ) వేతన సంఘం ప్రకారమే జీతాలు అందుతాయి. ఒకసారి కొత్త ఫ్రేమ్‌వర్క్ ఖరారయ్యాక, బకాయిలతో కలిపి పెరిగిన జీతాలు అందుతాయని సమాచారం.
READ ALSO: Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..
హోలీ కానుకగా 5% డీఏ (DA) పెంపు..
ద్రవ్యోల్బణాన్ని బట్టి పెంచే కరువు భత్యం (DA) ఈసారి 5 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత డీఏ 58%, పెరిగిన తర్వాత డీఏ 63% కు చేరుకోవచ్చని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పెంపును మార్చిలో (హోలీ పండుగ సందర్భంగా) ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ పెంపు జనవరి 2026 నుంచి వర్తిస్తుంది కాబట్టి, ఏప్రిల్ జీతంలో బకాయిలతో కలిపి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. కొత్త వేతన సంఘంపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఫిబ్రవరి 25న ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇందులో కనీస వేతనం ఎంత ఉండాలి?, జీతభత్యాలు ఎంత పెంచాలి? అనే అంశాలపై ఒక ముసాయిదాను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని సమాచారం. ఉద్యోగ సంఘాల డిమాండ్ల విషయానికి.. వేతన సంఘం తన రిపోర్టును 200 రోజుల్లోనే సమర్పించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్రపాలిత ప్రాంతాల వారికీ ఒకేసారి వేతన సవరణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారిక వెబ్‌సైట్ ప్రారంభం..
8వ వేతన సంఘం పనులను వేగవంతం చేసేందుకు, పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్తగా www.8cpc.gov.in అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సలహాలను, అభిప్రాయాలను నేరుగా ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు.
READ ALSO: T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాను తేరుకోలేని దెబ్బకొట్టిన జింబాబ్వే!
