Site icon NTV Telugu

IAS, IPS Transfers : బదిలీల విషయం త్వరగా తేల్చండి.. హైకోర్టును కోరిన కేంద్రం

Ts High Court

Ts High Court

IAS, IPS Transfers : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల అంశంలో కేంద్రం తెలంగాణ హైకోర్టుకు సూచన చేసింది. ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల విచారణను అ‍త్యవసరంగా చేపట్టాలని కోర్టును కేంద్రం కోరింది. ఈ క్రమంలో జూన్‌ 5వ తేదీన విచారిస్తామని హైకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 14 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే వారు ఎక్కడికక్కడ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు.

Read Also: Renu Desai: అసలు సలహాలు ఇవ్వడానికి మీరెవరు..? పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్

ఈ నేపథ్యంలో క్యాట్‌ ఉత్తర్వులపై కేంద్రం.. హైకోర్టుకు వెళ్లింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో సోమేష్‌ కుమార్‌ ఏపీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మేరకు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది. అయితే జూన్ 5న విచారిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.

Read Also:Ranga Reddy : గండిపేటలో స్కూల్ బస్సు బీభత్సం.. 18 మంది విద్యార్థులకు గాయాలు

Exit mobile version