AP Elections 2024: ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశమైంది. తొలి రోజున 18 జిల్లాల సమీక్ష జరగగా.. ఇవాళ 8 జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నెలలోనే ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇవాళ నంద్యాల, కర్నూలు సత్యసాయి, అనంతపురం, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం సమావేశమైంది.
Read Also: CM YS Jagan Tour: మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లా పర్యటన
ఈ సమావేశంలో చెక్ పోస్టులు, ఎన్నికల తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రతపై సమీక్ష నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకు కేంద్ర బృందం సూచనలు చేయనుంది. ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని తొలి రోజు సమావేశంలో సీఈసీ బృందం హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం నుంచి సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఈసీ బృందం భేటీ కానుంది.