NTV Telugu Site icon

Shridhar Babu: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ కల్పనలో విఫలం

Sridhar Babu

Sridhar Babu

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి నది తీరంలో గల బ్రాహ్మణ సంఘ భవనంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ కల్పనలో విఫలం అయ్యారు అని విమర్శించారు. లక్ష రూపాయల లోన్ మాఫీ అనేది ఒక మోసమని మిత్తి కూడా మాఫీ చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: Pushpa 2: జాలిరెడ్డి ఈసారి అంతకు మించి చూపిస్తాడట

నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్లతో ఏర్పడ్డ తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పించకుండా ఎన్నికలకు ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి అందజేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దళిత బంధు పథకం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని అర్హులైన దళితులందరికీ అందజేయాలి.. వరి ధాన్యం కొనుగోల్లో తప్పతాలతో క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీసి రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన విమర్శించారు.

Read Also: Slum Dog Husband: ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ఈ కామెడీ మూవీ చూసి నవ్వుకోవాలనుకుంటున్నారా? ఓటీటీలో స్ట్రీమింగ్ అప్పుడే

అంతర్జాతీయ చమురు బ్యారెల్ ధరలు తగ్గినప్పటికీ సిలిండర్ ధర విపరీతంగా కేంద్ర ప్రభుత్వం పెంచింది అని శ్రీధర్ బాబు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో స్కామ్ జరిగిందని దీంతో చదువుకున్న విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి తీర ప్రాంత రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదు.. కానీ మెగా కృష్ణారెడ్డి జేబులు నింపడానికి ఉపయోగపడింది అని శ్రీధర్ బాబు ఆరోపించారు.

Read Also: Eesha Rebba : ఆరెంజ్ డ్రెస్ లో కిర్రాక్ పోజులిస్తూ రెచ్చగొడుతుందిగా..

ఎన్నికలకు ముందు ధర్మపురి దేవస్థాన అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వన్ పర్సెంట్ నిధులను కూడా డెవలప్మెంట్ కోసం విడుదల చేయలేదు అని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సామాజిక సమన్యాయంతో ముందుకు వెళుతుందని.. సామాజిక తెలంగాణ కొరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.