రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాను అప్డేట్ ఏళ్లు గడవడంతో లబ్ధిదారుల్లో జరిగిన మార్పులను సవరించేందుకు ఈ-కేవైసీల ధ్రువీకరణ ప్రారంభించారు. లబ్ధిదారుల్లో కొంత మంది చనిపోయినా.. మరికొంత మంది పెళ్లి తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి స్థిరపడినప్పటికీ వారి పేరు మీద కుటుంబసభ్యులు రేషన్ తీసుకుంటూరని కేంద్రం గుర్తించింది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాగా.. తాజాగా ఆధార్, ఈ-కేవైసీల ధ్రువీకరణ ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం వివరించింది. తద్వారా పెద్ద ఎత్తున అక్రమాలను నివారించి, అర్హులకు పంపిణీని మెరుగుపర్చడం సాధ్యమైనట్లు వెల్లడించింది.
READ MORE: IPL 2025 Auction: అతడికి ఆల్‌టైమ్ రికార్డు ధర పక్కా.. సురేష్ రైనా జోస్యం!
దేశ ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార భద్రత కార్యక్రమాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని.. ఆహార భద్రత కింద 80.6 కోట్ల మంది లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 20.4కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తైంది. 99.8శాతం రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. బయోమెట్రిక్ ద్వారా 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ, ఈ-కేవైసీ ప్రక్రియతో ఇప్పటివరకు 64శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయ్యింది. 98 శాతం ఆహార ధాన్యాల పంపిణీలో ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను వినియోగిస్తున్నారు.
READ MORE:Game Changer : ‘గేమ్ ఛేంజర్’ మూడో సింగిల్ సాంగ్‌పై క్రేజీ అప్డేట్