Tollywood : టాలీవుడ్లో సెన్సార్ సెగ.. మారుతున్న సినిమాల టైటిల్స్..’హే భగవాన్’ కాస్తా ‘హే బలవంత్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ప్రమోషన్లన్నీ ఒక పేరుతో పూర్తి చేసుకున్నాక, సరిగ్గా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చే సమయంలో టైటిల్ మార్చాల్సి రావడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా యంగ్ హీరో సుహాస్ నటించిన సినిమా కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. కేవలం సుహాస్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో మరికొన్ని చిన్న సినిమాలు కూడా సెన్సార్ అబ్జెక్షన్స్ వల్ల పేర్లు మార్చుకున్నాయి.
Also Read : Tollywood : సంగీత దర్శకుల విషయంలో అయోమయంలో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం ‘హే భగవాన్’. ఈ నెల 20న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుడి పేరుతో ఉన్న టైటిల్ వల్ల కొన్ని వర్గాల సెంటిమెంట్స్ దెబ్బతినే అవకాశం ఉందని భావించిన బోర్డు, పేరు మార్చాలని సూచించింది. దీంతో మేకర్స్ చేసేదేమీ లేక చివరి నిమిషంలో టైటిల్‌ను ‘హే బలవంత్!’ గా మార్చారు. ప్రమోషన్లన్నీ పాత పేరుతోనే జరగడంతో ఈ మార్పు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.
Also Read : Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి సినిమాలో గెస్ట్ రోల్ లో ‘సిద్దు జొన్నలగడ్డ’ & ‘కీర్తి సురేష్’
ఇటీవల విడుదలైన ‘వానర‘ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ చిత్రంలో కుల రాజకీయాలు మరియు సున్నితమైన అంశాలు ఉండటం, టైటిల్ ఏమో హనుమంతుడిని గుర్తు చేసేలా ఉండటంతో సెన్సార్ బోర్డు నో చెప్పింది. దీంతో ఈ సినిమాను ‘వనవీర’ పేరుతో విడుదల చేయాల్సి వచ్చింది. ప్రమోషన్ల కోసం ఖర్చు పెట్టిన డబ్బు, టైటిల్ రీచ్ అంతా వృథా అయిందని ఆ చిత్ర దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే శివ కందుకూరి నటించిన ‘చాయ్ వాలా‘ సినిమాకు కూడా సెన్సార్ కష్టాలు తప్పలేదు. ఈ టైటిల్ వాడకూడదని బోర్డు పట్టుబట్టడంతో, చిత్ర యూనిట్ తమ వర్కింగ్ టైటిల్ అయిన ‘నవాబ్ కేఫ్’ను ఖరారు చేసింది. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ ఎమోషనల్ డ్రామా ఫిబ్రవరి 20న కొత్త పేరుతో థియేటర్లలోకి రానుంది. చిన్న సినిమాలకు టైటిల్ అనేది బ్రాండింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి సమయంలో సెన్సార్ బోర్డు నిబంధనలు చిన్న నిర్మాతలకు భారంగా మారుతున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్‌తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!