NTV Telugu Site icon

Health Tips : ఆ కారణంగా ప్రజల్లో పెరుగుతున్న మతిమరుపు.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

New Project (77)

New Project (77)

Health Tips : కాలంతో పాటు మనం కూడా మారాలి. కానీ అవసరానికి మించిన విషయాలు తెలుసుకుంటూ జనాలు చాలా స్మార్ట్ అవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు. ప్రస్తుతం అసలు దేని గురించి మాట్లాడుతున్నామో ఇప్పటికి మీకు అర్థం అయి ఉంటుంది.. అదేనండి సెల్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తర్వాత జనాలు ఎంతలా మారిపోయారు అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వాటిని వాడేస్తున్నారు. ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా ఫర్వాలేదు కానీ జేబులో మాత్రం సెల్ ఫోన్ ఉండాల్సిందే. అంతలా సెల్ ఫోన్ పై పిచ్చి పెంచుకున్నారు జనాలు.

Read Also:Shraddha Srinath: ‘డాకు మహారాజ్’ దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు

ప్రస్తుతం ప్రతి ఒక్కరి శరీరంలో ఓ భాగంగా సెల్ ఫోన్ మారిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ల కారణంగా ఎంత మేర లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది. ముఖ్యంగా పిల్లల చదువుల దగ్గర నుంచి పెద్దలకు సంబంధించిన బ్యాంక్ పనుల వరకు అన్ని పనులకు స్మార్ట్ ఫోన్ తప్పని సరి అయింది. చివరకు పిల్లల చదువుకు సంబందించిన సమాచారం మొత్తం కూడా పాఠశాలు ఫోన్ లోనే అందిస్తున్నాయి. దీంతో పిల్లల చేతికి కూడా ఫోన్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఒక గంట సేపు ఫోన్ చేతిలో లేకపోతే విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా యువత లక్షలకు లక్షలు పోసి మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లతో పాటు ఇంటర్నెట్ వాడకం ఎక్కువ కావడంతో లక్షలాది యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని అడల్ట్ కంటెంట్, బెటింగ్ యాప్ ల కారణంగా యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇరవై ఏళ్లలోపు యువత ఎక్కువగా ఈ ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు.

Read Also:Aishwarya Rajesh: అనిల్ రావిపూడి డైలాగుల దెబ్బకు జ్వరం వచ్చేసింది: ఐశ్వర్య రాజేష్ ఇంటర్వ్యూ

అయితే తాజాగా జరిగిన పరిశోధన ప్రకారం స్మార్ట్ ఫోన్ ను రోజుకు సగటున 344 సార్లు అంటే ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి చూస్తున్నట్లు సర్వేలో తేలింది. పదే పదే సెల్ ఫోన్ చెక్ చేయడం వల్ల, నోటిఫికేషన్ రాకున్నా ఊరికే మొబైల్ ఆన్ చేసి చూస్తూ ఉండడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని నివేదికలో పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్క చిన్న విషయానికి ఫోన్ పై ఆధారపడడం వల్ల మెమోరీ పవర్ తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా వృద్ధాప్యంలో వినికిడి లోపం, వెంట్రుకలు తెల్లబడడం, మతిమరుపు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని మనకు ఇప్పటి వరకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కారణంగా చిన్న చిన్ని పిల్లలు కూడా వీటి బారిన పడుతున్నారు. ఇప్పటినే అమెరికాలో జరిపిన ఈ సర్వేలో దాదాపు చాలా మంది ఫోన్ కారణంగా చదువుకోవాల్సిన వయసులో ఈ మతిమరుపు వ్యాధితో బాధ పడుతున్నట్లుగా తెలిపారు. అంతేకాదు చిన్న పిల్లలకు ఈ సమస్య రావడానికి పెద్దగా టైం పట్టదు.. ఇప్పటి నుంచే వారిని ఫోన్ కి దూరంగా ఉండేలా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు.

Show comments