CCL 2026: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2026 సీజన్‌లో తెలుగు వారియర్స్ అదరగొట్టింది. విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్ జట్టుపై 52 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ సెంచరీతో జట్టు భారీ స్కోర్ చేసింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ అఖిల్ అక్కినేని అసాధారణ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఎండ్‌లో అశ్విన్ బాబు 51 బంతుల్లో 9 ఫోర్లతో 60 పరుగులు చేసి అఖిల్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో తెలుగు వారియర్స్ భారీ స్కోరు సాధించింది.
NTR Death Anniversary: కారణజన్ముడు, యుగ పురుషుడు.. ఎన్టీఆర్ కు ఘన నివాళి తెలిపిన సీఎం చంద్రబాబు..!
ఇక 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ దే షేర్ జట్టు తెలుగు వారియర్స్ బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. 18.2 ఓవర్లలోనే 132 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ జట్టులో కరణ్‌వాహి (56), హర్డీ సంధు (28) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. తెలుగు వారియర్స్ బౌలింగ్ విభాగంలో వినయ్ మహదేవ్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్రాట్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అభిమానులు వీక్షించవచ్చు.
@AkhilAkkineni8 101*
What a hitting 🎯
Ramp innings 🔥#Lenin #AkhilAkkineni #TeluguWarriors #CCL2026 pic.twitter.com/kiUG401TE1
— SunilKumar (@SunilkumarBejju) January 17, 2026
