Site icon NTV Telugu

Delhi Liquor Scam: ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీబీఐ సోదాలు

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. గతంలో కూడా మనీష్‌ ఇంటితో పాటు కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు చేపట్టిన విషయం విధితమే. తన కార్యాలయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు నిర్వహిస్తోందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

“ఇవాళ మళ్లీ సీబీఐ నా కార్యాలయానికి చేరుకుంది. వారికి స్వాగతం. నా ఇంటిపై దాడి చేశారు, నా కార్యాలయంపై దాడి చేశారు, నా లాకర్‌పై సోదాలు చేశారు. మా గ్రామంలో విచారణ నిర్వహించారు. నాకు వ్యతిరేకంగా ఏమీ కనుగొనబడలేదు. నేను ఏ తప్పు చేయనందున ఏమీ కనుగొనబడలేదు.” అని మనీష్ సిసోడియా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇవాళ సిసోడియా కార్యాలయంలో తాము ఎలాంటి దాడులు నిర్వహించలేదని దర్యాప్తు సంస్థ తిరస్కరించింది.

DMK vs Governor: కాశ్మీర్ వెళ్లు, ఉగ్రవాది చేతిలో చావు.. గవర్నర్‌కు డీఎంకే నేత బెదిరింపు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నుంచి విచారణకు అనుమతి లభించిన తర్వాత ఆగస్టులో సిసోడియా ఇంటిపై సీబీఐ పలుమార్లు సోదాలు నిర్వహించింది. మద్యం షాపుల లైసెన్సుల కోసం ప్రైవేటు వ్యక్తుల ద్వారా రాజకీయ నేతలకు ముడుపులు అందజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

 

Exit mobile version