Ayesha Meera Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అయేషా మీరా హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసులు జారీ చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. కేసుకి సంబంధించి సీబీఐ నివేదిక తమకు ఇవ్వాలని కోరుతూ ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ పాషా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు నివేదిక ఇవ్వకుండా అభ్యంతరాలను ఎలా తెలియజేస్తామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. ఈ కేసు హైకోర్టులో విచారణ దశలో ఉందని.. అది తేలాల్సి ఉందని జడ్జి అన్నారు. అయితే, ఈ కేసులో సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు..
Read Also: Komatireddy Rajagopal Reddy: పార్టీ మార్పుపై మరోసారి స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. ఏమన్నారంటే..?
కాగా, 18 ఏళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలోని మహిళల హాస్టల్‌లో బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకు గురయ్యారు. ఈ కేసును పునర్విచారించిన సీబీఐ సత్యంబాబుపై పెట్టిన ఐపీసీ 376, 302 సెక్షన్లపై ఈ నెల 19న విజయవాడలోని సీబీఐ న్యాయస్థానానికి హాజరై అభ్యంతరాలుంటే చెప్పాలని ఆయేషామీరా తల్లిదండ్రులు షంషాద్‌బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషాలకు నోటీసులు పంపిన విషయం విదితమే.. అయితే, ఈ కేసులో సీబీఐ నివేదిక తమకు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆయేషా తల్లిదండ్రులు.. ఈ వ్యవహారంపై ఆయేషా మీరా తండ్రి పిటిషన్ దాఖలు చేయగా.. సీబీఐకి నోటీసులు ఇస్తూ.. విచారణ వచ్చే నెల 10కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు
