NTV Telugu Site icon

Bribe : హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు

Cbi

Cbi

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్ తో పాటు ఇన్స్పెక్టర్ మనీష్ శర్మ పై కేసు నమోదు చేసింది సీబీఐ. ఓ వ్యక్తి నుండి జీఎస్టీ అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. ఐరన్ స్క్రాప్ గోదాం లో అక్రమాల పై ఫైన్ విధించిన జీఎస్టీ అధికారులు… బాధితుడు నుండి ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్‌ చేశారు. ఇవ్వకపోవడంతో స్క్రాప్ గోదామును సీజ్ చేశారు అధికారులు. సీజ్ చేసిన గోదాంను ఓపెన్ చేసేందుకు మరో 3 లక్షలు డిమాండ్ చేశారు జీఎస్టీ అధికారులు. దీంతో.. బాధితుడు సీబీఐ అధికారులు విన్నవించుకోవడంతో.. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రెండు ప్రాంతాల్లో సోదాల నిర్వహించిన సీబీఐ అధికారులు.. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

మీకు మతిమరుపు ఉందా.. అయితే ఈ మూలికలను వాడండి..?

Show comments