CBI: నకిలీ భారత కరెన్సీ నోట్ల కేసులో ఎన్‌ఐఏకు కావలసిన నిందితుడు మొయిదీనబ్బ ఉమ్మర్ బేరీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి ఇంటర్‌పోల్ చానెళ్ల ద్వారా విజయవంతంగా భారతదేశానికి తీసుకురావడంలో సీబీఐ కీలక పాత్ర పోషించింది. సీబీఐ ఇంటర్‌పోల్ అంతర్జాతీయ పోలీసు సహకార విభాగం (IPCU), అబూదాబి నేషనల్ సెంట్రల్ బ్యూరో (NCB) సమన్వయంతో నిందితుడు మొయిదీనబ్బ ఉమ్మర్ బేరీని జూన్ 20న భారత్‌కు రప్పించింది. అతను దుబాయ్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు.
Read Also: Netanyahu: ఆమెరికా ఆదేశాల కోసం ఎదురుచూడలేం.. అణు స్థావరాలను మేమే ధ్వంసం చేస్తామన్న నెతన్యాహు
ఈ నిందితుడిని ముందుగా యూఏఈలో సీబీఐ, అబూదాబి ఎన్‌సీబీ మాద్యమంగా ఇంటర్‌పోల్ ద్వారా గుర్తించడం జరిగింది. అనంతరం రెడ్ నోటీసు ఆధారంగా అతడిని అరెస్ట్ చేసి భారతదేశానికి తరలించారు. మొయిదీనబ్బపై ఎన్‌ఐఏ కొచ్చి బ్రాంచ్ ఆధ్వర్యంలో నకిలీ నోట్ల తయారీ, మోసం, క్రిమినల్ కౌన్స్పిరసీ ఆరోపణలతో కేసు నమోదైంది. అతను దుబాయ్‌లో నకిలీ భారత కరెన్సీ నోట్లను పొందాడని, షార్జా ద్వారా బెంగళూరుకు తరలించాడని ఎన్‌ఐఏ అభియోగం.
Read Also: Mayor Suresh Babu: కడప కార్పొరేషన్ సమావేశంపై ఉత్కంఠ.. నా ఇష్టం అంటున్న మేయర్!
సీబీఐ 2013 డిసెంబర్ 30న ఇంటర్‌పోల్ ద్వారా నిందితుడిపై రెడ్ నోటీసును జారీ చేసింది. ఈ నోటీసును ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖలకు పంపించారు. యూఏఈలో అతడిని అరెస్ట్ చేసిన తరువాత, మంత్రిత్వ శాఖల ద్వారా అధికారిక ఎక్స్‌ట్రడిషన్ అభ్యర్థన కూడా పంపబడింది. ఇంటర్‌పోల్‌కు భారతదేశ నేషనల్ సెంట్రల్ బ్యూరోగా పనిచేస్తున్న సీబీఐ, దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ శాఖలతో భారతపోల్ ద్వారా సమన్వయం చేస్తూ ఇంటర్‌పోల్ సహకారంతో నేరస్థుల ట్రాకింగ్, అరెస్ట్, తరలింపులను సమర్థంగా నిర్వహిస్తోంది. ఈ ఇంటర్‌పోల్ చానెళ్ల ద్వారా 100కిపైగా అంతర్జాతీయ నేరస్థులను భారత్‌కు తీసుకురాగలిగింది.
