Site icon NTV Telugu

Jai Anmol Ambani: అంబానీ ఫ్యామిలీకి CBI ఝలక్.. జై అన్మోల్‌పై రూ. 228 కోట్లు బ్యాంకు మోసం ఆరోపణ

Jai Anmol Ambani

Jai Anmol Ambani

Jai Anmol Ambani: కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) పై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో FIR నమోదు చేసింది. ఇందులో బ్యాంకుకు రూ. 228 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ కేసు ఇదివరకు ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుత యూనియన్ బ్యాంక్) ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైంది. ఫిర్యాదులో RHFL, జై అన్మోల్ అంబానీతో పాటు సంస్థ డైరెక్టర్లైన రవీంద్ర శరద్ సుధాకర్ పేర్లు కూడా ఉన్నాయి.

Telangana Rising Global Summit Day 2: తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రెండో రోజు రూ.1,11,395 కోట్లకు ఎంవోయూలు..

ఈ ఫిర్యాదు ప్రకారం రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వ్యాపార అవసరాల కోసం ముంబైలోని బ్యాంకు SCF బ్రాంచ్ నుంచి రూ. 450 కోట్ల వరకు క్రెడిట్ లిమిట్లను పొందింది. ఇందుకు బ్యాంకు కొన్ని ఆర్థిక క్రమశిక్షణ నియమాలను విధించింది. వీటిలో సమయానికి చెల్లింపులు, వడ్డీ చెల్లింపు, భద్రత పత్రాలు సమర్పించడం, అలాగే మొత్తం అమ్మకాల ఆదాయం బ్యాంకు ఖాతా ద్వారా మళ్లించడం వంటి షరతులు ఉన్నాయి. అయితే, సంస్థ ఈ షరతులను పాటించకపోవడంతో 2019 సెప్టెంబర్ 30న ఖాతాను NPA (Non-performing Asset)గా మార్చినట్లు అధికారులు తెలిపారు.

2% బ్యాటరీతో 60 నిమిషాల కాలింగ్‌, 108MP కెమెరాతో Honor Magic 8 Lite లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!

మరోవైపు గ్రాంట్ థోర్న్టన్ (GT) సంస్థ 2016 ఏప్రిల్ 1 నుంచి 2019 జూన్ 30 వరకు ఖాతాలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో కీలక అంశాలు బయటపడ్డాయి. ఈ పరిశీలనలో రుణంగా తీసుకున్న నిధులను దుర్వినియోగం చేసినట్లు, అలాగే అవి మళ్లింపు చేసినట్లు కనుగొన్నారు. బ్యాంకు ఆరోపణల ప్రకారం.. సంస్థ మాజీ ప్రమోటర్లు, డైరెక్టర్లు కావడంతో జై అన్మోల్ అంబానీ తదితరులు నిధులను అక్రమంగా మళ్లించి, దుర్వినియోగం చేసారని.. అలాగే క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్‌కు పాల్పడ్డారని తేలింది. ఇచ్చిన రుణాన్ని నిజమైన వ్యాపార అవసరాలకు కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించినట్లు CBI దర్యాప్తులో తేలింది.

Exit mobile version