CBI arrests WAPCOS former CMD Rajinder Gupta, son in disproportionate asset case: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) బుధవారం వాప్కోస్(WAPCOS) మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజిందర్ కుమార్ గుప్తా, అతని కుమారుడు గౌరవ్‌ను అరెస్టు చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, సోనిపట్, ఘజియాబాద్‌తో పాటు దేశంలోని 19 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించి నిందితుల వద్ద రూ.38 కోట్ల నగదును గుర్తించింది. ఈ సోదాల్లో మంగళవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. బుధవారం మరో రూ.18 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.
Read Also: Jharkhand Wedding: పూరీలు వేడిగా లేవని రచ్చరచ్చ చేశారు.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నియంత్రణలో పనిచేసే ప్రభుత్వం రంగ సంస్థ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్(WAPCOS) ఇండియా లిమిటెడ్ మాజీ సీఎండీ తన పదవీకాలంలో ఉన్న సమయంలో భారీగా అక్రమార్జనకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజిందర్ కుమార్ గుప్తాతోపాటు ఆయన భార్య రీమా సింఘాల్, తనయుడు గౌరవ్ సింఘాల్, కోడలు కోమల్ సింఘాల్‌లపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోదాలు నిర్వహించగా.. భారీగా నగదుతో పాటు నగలు, విలువైన ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన పలు దస్త్రాలను సైతం స్వాధీనం చేసుకునట్టు అధికారులు తెలిపారు. రాజిందర్ గుప్తాతో పాటు ఆయన తనయుడు గౌరవ్ సింఘాల్‌ను సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 2011 ఏప్రిల్ నుంచి 2019 మార్చి 31వరకు వాప్‌కాస్ సంస్థలో గుప్తా పదవీకాలంలో ఉన్న సమయంలో భారీగా అక్రమార్జనకు పాల్పడినట్టు తెలుస్తోంది.
