NTV Telugu Site icon

Ys Viveka Case: వివేకా కేసులో సీబీఐ దూకుడు.. పులివెందులలో తనిఖీలు

Ys Viveka

Ys Viveka

మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కడపలో సీబీఐ అధికారులు ఆకస్మికంగా పర్యటించారు. పులివెందులకు వెళ్ళిన సీబీఐ అధికారులు వైఎస్ వివేకా ఇంటిని పరిశీలించారు. కడప నుంచి నేరుగా పులివెందుల లోని వైఎస్ వివేక నంద రెడ్డి ఇంటికి చేరుకుని హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు సీబీఐ అధికారి..తరువాత ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి.వెళ్లి పరిశీలించారు సీబీఐ అధికారి. కొద్ది సేపటికే మళ్లీ వివేకా ఇంటికి వచ్చేశారు సీబీఐ అధికారి. వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన ఇనాయతుల్లాను విచారిస్తున్నారు సీబీఐ అధికారి..వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

Read Also: Wrestlers Protest: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. జంతర్‌మంతర్ వద్ద మరోసారి ఆందోళన

హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనేదానిపై ఆరా తీస్తుంది సీబీఐ. హత్య జరిగిన రోజు వివేక మృతదేహాన్ని ముందుగా ఫోటోలు, వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపించారు ఇనయ్ తుల్లా. ఇదిలా ఉంటే వైయస్ వివేకా హత్య కేసులో కీలక పురోగతిని సాధించింది సిబిఐ..హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన రెండు బృందాలు పులివెందుల లో తనిఖీలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉంటే.. రేపు సుప్రీంకోర్టులో జరిగే విచారణకు హాజరుకానుంది మరొక బృందం.సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా వైఎస్ వివేకా హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తుంది సిబిఐ. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కొత్త కోణాలను రేపు సుప్రీంకోర్టు ముందు ఉంచనుంది సిబిఐ అధికారుల బృందం. ఐదు రోజులుగా వైఎస్ వివేకా కేసులో ఉదయ్ కుమార్, భాస్కర్ రెడ్డి లను కస్టడీ లోకి తీసుకొని విచారించింది సీబీఐ. మూడు రోజులు పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించింది సీబీఐ.

రేపు వై ఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. గత శుక్రవారం సునీత పిటిషన్ విచారించింది సీజేఐ ధర్మాసనం. అవినాష్ రెడ్డి కి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పై కీలక ఆదేశాలిచ్చింది ధర్మాసనం. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం… హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తే అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందని చెప్పారు అవినాశ్ తరఫు న్యాయవాది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే, సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐ ని ఆదేశించింది ధర్మాసనం. సోమవారం ఏం జరుగుతుందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Read Also: Pawan Kalyan Vs Prabhas: పవన్ ను ఫ్యాన్ ను హత్య చేసిన ప్రభాస్ ఫ్యాన్.. అది మార్చలేదని