Cattle Care In Winter : చలికాలంలో దూడల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలం వచ్చేసింది.. చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది.. చలి కేవలం మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా చలి ఉంటుంది.. దాంతో అనారోగ్యానికి కూడా గురవుతాయి.. అంతేకాదు ఎన్నో మార్పులు కూడా వస్తాయి.. దూడలను విపరీతమైన చలి, చలి గాడ్పుల నుంచి కాపాడుకోవడానికి వెచ్చని నివాస వసతిని కల్పించాలి. ముఖ్యంగా రాత్రిపూట దూడలను షెడ్ల లోనే ఉంచాలి. పాకలకు ఇరువైపులా గోనె పట్టాలను వేలాడ దీయాలి. పాకల్లో నేలపై రాత్రిపూట వరిగడ్డిని పరిచినట్లయితే వెచ్చగా ఉంటుంది.. ఇక పశువులను వెచ్చగా ఉంచేందుకు రూమ్ హీటర్లను ఏర్పాటు చెయ్యాలి.. అప్పుడే టెంపరేచర్ సరిపోతుంది..
అంతేకాదు రూమ్ టెంపరేచర్ పెంచడంతో పాటు దూడల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి.. ఆవుదూడ శరీర బరువులో పదోవంతు పాలను, గేదె దూడలకు పదిహేనవ వంతు పాలను తాగించాలి. రెండు నెలల వయస్సు గల దూడలకు ప్రత్యేకంగా తయారు చేసిన కాప్ స్టార్టర్ను దాణాగా ఇవ్వాలి. దూడ లకు మొదటి మూడు నెలలు మాత్రమే పాలను తాగించాలి.. ఆ తర్వాత తగ్గిస్తూ రావాలి.. ఆ తర్వాత ఎక్కువగా పచ్చి గడ్డి, ఎండుగడ్డి తో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా ఇవ్వాలి..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
దూడలకు దాణా ఇవ్వడం చాలా మంచిది.. దాణాలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఆరోగ్యంగా ఉండి శరీర బరువు పెరుగుతుంది. దూడల దాణాలో రెండు శాతం ఖనిజ లవణ మిశ్రమాన్ని, ప్రతి 100 కిలోల దాణాలో 10 గ్రా. విటమిన్ ఎ, డి లను కలపాలి. దూడలకు ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వడం వల్ల అవి ఆరోగ్యంగా ఉండటం తో త్వరగా బరువును కూడా సకాలం లో పెరుగుతాయి.. చలికాలంలో న్యూమోనియా వ్యాధిసోకే ప్రమాదం ఉంది.. దూడలు బొడ్డువాపు, విరేచనాలు, కడుపుబ్బడం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. ఆ వ్యాధులను వెంటనే గుర్తించి డాక్టర్ల సలహాలను తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!