Site icon NTV Telugu

Catherine Tresa : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ హాట్ బ్యూటీ..?

Whatsapp Image 2023 07 18 At 6.59.53 Pm

Whatsapp Image 2023 07 18 At 6.59.53 Pm

కేథరిన్ ట్రెసా..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ  ముందుగా వరుణ్ సందేశ్ చమ్మక్ చల్లో సినిమా లో నటించిన  ఆ తరువాత పూరి జగన్నాద్ తెరకేక్కిస్తున్న ఇద్దరమ్మాయిలతో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పూరి తో చేసిన సినిమా ముందుగా విడుదల అవ్వడంతో ఈ భామ తెలుగు డెబ్యూ మూవీ ఇద్దరమ్మాయిలతో సినిమా అయింది.ఈ సినిమా అంతగా ఆకట్టుకోక పోయిన సినిమాలో ఈ భామ హాట్ లుక్స్ కి అలాగే తన నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు దీనితో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి.

ఆతరువాత ఈ భామ తెలుగు, తమిళ మరియు కన్నడ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.చాలా సినిమాల్లో నటించినప్పటికీ కేవలం సెకండ్ హీరోయిన్ గానే ఈమెకు ఎక్కువ గా అవకాశాలు వస్తున్నాయి.ఆ తర్వాత ఈ భామ ఐటెం సాంగ్స్ కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె సరైనోడు, గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి, రుద్రమదేవి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.. ఇక ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అయినా బింబిసార సినిమా లో హీరోయిన్ గా నటించింది.అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ సరసన నటించింది.ఇదిలా ఉంటే కేథరీన్ ట్రెసా త్వరలో నే పెళ్లి చేసుకోబోతుంది అంటూ నెట్టింట ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.కేథరిన్ ట్రెసా చాలా రోజుల నుండి తన చిన్న నాటి ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉందని అలాగే ఇంట్లో వారికీ ఈ విషయం చెప్పి వారిని ఒప్పించిందని, త్వరలోనే కేథరీన్ తన ఫ్రెండ్ తో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.మరీ ఈ వార్త కేథరిన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..

Exit mobile version