NTV Telugu Site icon

Viral Video: అబ్బో జోరుగా డబ్బులు లెక్కెడుతున్న పిల్లి.. వీడియో వైరల్

Cat

Cat

ఓ పిల్లి అకౌంటింగ్ అవతారమెత్తింది. హ్యాపీగా ఓ బెడ్ మీద కూర్చుని డబ్బులు లెక్కపెడుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Medak Crime: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని హత్య చేసిన కొడుకు

సాధారణంగా పిల్లులను కూడా పెంచుకునే జనాలు చాలా మంది ఉన్నారు. వాటికి పాలు, బ్రెడ్ లాంటివి పెడుతూ.. అల్లారుముద్దుగా ఓ కుక్కను పెంచుకున్నట్లు పెంచుకుంటారు. గ్రామాల్లో ఐతే పిల్లులు ఇంట్లోకి చొరబడితే జనాలు తరిమి కొడుతుంటారు. అలాంటిది కొందరు పిల్లులను ఒక బేబీలా చూసుకుంటారు. అంతే కాకుండా అవి చేసే.. చిలిపి పనులతో వారు ఆనందపడుతారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లి చేష్టలు చూస్తే.. మీరు ముక్కున వేలేసుకుంటారు. దర్జాగా ఓ బెడ్ లో కూర్చున్న క్యాట్.. డబ్బుల కట్ట ముందు పెట్టుకుని జోరుగా డబ్బులు లెక్కపెడుతుంది. అంతేకాకుండా డబ్బులు లెక్కపెట్టే దానిపై చాలా ఇంట్రెస్ట్ పెట్టినట్టుంది. అందుకే పక్కకు చూడకుండా డబ్బులను ఓ తెగ లెక్కిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

Snake In Rtc Bus: అమ్మో ఆర్టీసి బస్సులో పాము.. ప్రయాణికులు షాక్

cats with jobs అనే ఐడీతో సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు దీనిని 1లక్ష84 వేల మంది చూశారు. అంతేకాకుండా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పిల్లి డబ్బులు లెక్కించడంలో బిజీగా ఉన్నట్లు ఉంది. ఎవరూ డిస్ట్రబ్ చేయొద్దంటూ రాసుకొస్తున్నారు.