స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గొప్ప నటుడు అని, అయితే సినిమాల్లోకి మాత్రం రావొద్దని కాస్టింగ్ డైరెక్టర్, నటుడు ముఖేష్ ఛబ్రా అంటున్నారు. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన అనంతరం క్రీడారంగంలోనే కొనసాగాలని, రంగుల ప్రపంచంలోకి వచ్చే సాహసం మాత్రం అస్సలు చేయొద్దని సూచించారు. విరాట్ ఎన్నో యాడ్స్ చేశాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి కూడా పలు టీవీ యాడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు.
Also Read: iQOO Z9s Pro Price: ‘ఐకూ’ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్స్.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్స్!
రణవీర్ అల్లాబాడియా పోడ్‌కాస్ట్‌లో ముఖేష్ ఛబ్రా మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ గొప్ప నటుడు. అతను ఢిల్లీకి చెందినవాడు. పంజాబీ కుటుంబం నుంచి వచ్చిన అతడు జీవితాన్ని చదివేశాడు. విజయాన్ని ఎంతో నేర్పుగా అదిమిపట్టుకున్నాడు. లుక్స్, ఫిట్‌నెస్, మానసికంగా.. అన్నింటిలో శ్రద్ధ తీసుకున్నాడు. విరాట్ గొప్పవాడు, తెలివైనవాడు. అతడు చాలా ఫన్నీగా ఉంటాడు. బాగా డ్యాన్స్ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు, కామెడీ టైమింగ్ కూడా బాగా ఉంటుంది. విరాట్ మన దేశం గర్వపడే స్థాయికి ఎదిగాడు. విరాట్ క్రీడారంగంలోనే కొనసాగాలి. రిటైర్‌మెంట్ అనంతరం సినిమాల్లోకి రాకూడదు’ అని అన్నాడు.