Caste Census Postponed: ఆంధ్రప్రదేశ్‌లో కుల గణన మరోసారి వాయిదా పడింది.. నిజానికి ఏపీ ప్రభుత్వం నవంబర్ 27వ తేదీ నుండి కుల గణన ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించింది. కానీ, ఆ తేదీని మార్చుతూ.. డిసెంబర్ 9వ తేదీగా గతంలో ప్రకటించారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. డిసెంబర్ 9వ తేదీ నుంచి కుల గణన ప్రక్రియ షురూ కాబోతుంది అంటూ నవంబర్ 24న ప్రకటించారు.. కానీ, ఇప్పుడు మరోసారి కుల గణన వాయిదా పడింది.. ఈ నెల 9న జరగాల్సిన సమగ్ర కుల గణన మిచౌంగ్ తుఫాన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ..
Read Also: Daggubati Abhiram: ఘనంగా రానా తమ్ముడి పెళ్లి.. ఫోటోలు వైరల్
రాష్ట్రంలో కుల గణన వాయిదా పడింది .. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టంపై అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది.. ఈ సమయంలో తుఫాన్ నష్టం, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.. అందుకే 9వ తేదీ నుంచి చేపట్టాల్సిన కుల గణన వాయిదా వేసినట్టు వెల్లడించారు వేణుగోపాలకృష్ణ.. తుఫాన్ పరిస్థితులు చక్కబడిన వెంటనే త్వరలో కులగణన తేదీని ప్రకటిస్తాం.. అబద్దానికి చంద్రబాబు ఒక రూపం.. తుఫాన్ పై కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని వాలీంటీర్, సచివాలయ వ్యవస్థ ఏపీలో ఉంది.. తుఫాన్ పై ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.
