Site icon NTV Telugu

YSRCP MLA Rachamallu : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

Rachamallu

Rachamallu

YSRCP MLA Rachamallu : కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీకి రాజీనామా చేయాలని బెదిరించారని ఫిర్యాదు చేశారు కౌన్సిలర్‌ వెంకటలక్ష్మి. కొద్ది నెలలుగా మూడో వార్డు కౌన్సిలర్‌ వెంకటలక్ష్మి, ఆమె భర్త రామాంజనేయ రెడ్డి ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు. గత నెల 19న ప్రచారం కోసం ప్రొద్దుటూరులోని మూడో వార్డుకు ఎమ్మెల్యే రాచమల్లు వెళ్లారు. వైసీపీకి రాజీనామా చేయకుంటే అంతుచూస్తానని ఎమ్మెల్యే బెదిరించినట్లు కౌన్సిలర్‌ వెంకటలక్ష్మి వాపోయారు.

 

Exit mobile version