కూకట్ పల్లి అంకుర హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్ సంధ్యకు చేధు అనుభవం ఎదురైంది. నిజంపేటకు చెందిన సంధ్య డెలివరీ కోసం అంకుర ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా ట్విన్స్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత MICU కి షిఫ్ట్ చేశారు. కాసేపటికే బాలింతకు చలి తీవ్రత పెరగడంతో కాళ్లకు హీట్ ప్యాడ్స్ కట్టారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది హీట్ ప్యాడ్స్ ను తీసేయడం మర్చిపోయారు.
Also Read:Daggubati Prasad: వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది.. గాలి తరహాలో జగన్ కూడా..!
ఆ తర్వాత బాధితురాలికి మత్తు వదిలి స్పృహలోకి వచ్చింది. అప్పటికే హీట్ ప్యాడ్స్ కారణంగా కాళ్లకు బొబ్బలు వచ్చాయి. ఆ బాధను భరించలేక బాధితురాలు కేకలు వేసింది. అప్పటికీ గాని ఆసుపత్రి సిబ్బంది మొద్దు నిద్ర వీడలేదు. బాలింత అరుపులతో తేరుకున్న సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ తీసేశారు. అప్పటికే సంధ్య రెండు కాళ్ళు బొబ్బలు ఎక్కి చర్మం ఊడిపోయింది. రెండు కాళ్లుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంకుర హాస్పిటల్ తీరుపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:COVID 19: ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం..! నలుగురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్
MICUలో సిబ్బంది లేరని, హౌస్ కీపింగ్ తో ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో సంధ్య చికిత్స పొందుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంకురా హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంకుర హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూకట్ పల్లి పోలీసులు అంకురా హాస్పిటల్ పై కేస్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
