NTV Telugu Site icon

Shanmukh Jaswanth: బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ పై కేసు నమోదు..

Shanmku

Shanmku

బిగ్‌బాస్‌ ఫేమ్ షణ్ముఖ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. షణ్ముఖ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి తాగినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. కాగా.. షణ్ముఖ్ ఇంట్లో ఇప్పటికే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. షణ్ముఖ్ సోదరుడు సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు షణ్ముక్ ఇంట్లోకి వెళ్లారు. దీంతో ఈ బండారం మొత్తం బయటపడింది. షణ్ముఖ్ అతని సోదరుడు గత కొంతకాలంగా గంజాయి తాగుతున్నట్లు గుర్తించారు. దీంతో.. షణ్ముక్‌, అతడి సోదరుడిని పోలీసులు విచారిస్తున్నారు.

CM YS Jagan in Danger: సీఎం జగన్‌కు పొంచువున్న ముప్పు..! ఇంటెలిజెన్స్ నివేదిక

షార్ట్ ఫిల్మ్స్లో అవకాశం ఇప్పిస్తానని వైజాగ్కి చెందిన డాక్టర్ యువతితో స్నేహం చేసిన షణ్ముఖ్ ఆమెను తన అన్న సంపత్ వినయ్ కి పరిచయం చేశాడు. వారిద్దరి మధ్య ప్రేమ పుట్టగా పదేళ్లుగా ప్రేమలో ఉండి ఇంట్లో ఒప్పించి పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో వైజాగ్ లో ఎంగేజ్మెంట్ జరుగగా యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఈనెల 28న ఇద్దరి పెళ్లి ప్రయత్నాలు జరుగుతుండగా సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు యువతికి షణ్ముఖ్ తండ్రి అప్పారావు సమాచారం ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది.

Srisailam Temple Trust: టీటీడీ తరహాలో శ్రీశైలానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి.. ట్రస్ట్‌ బోర్డ్‌ తీర్మానం..

యువతి ఫిర్యాదుతో సంపత్ వినయ్ ఫ్లాట్కి వెళ్ళిన పోలీసులు.. అక్కడ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఆ యువతి సంపత్ వినయ్ అనే యువకుడిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ ఫ్లాట్ కి వెళ్ళగా.. అక్కడ సంపత్ తమ్ముడు, బిగ్ బాస్ ఫేం షణ్ముక్ ఉన్నాడు. అప్పుడే ఫ్లాట్ లో కొన్ని మత్తు పదార్థాలు దొరికాయని అన్నారు.

Show comments