Site icon NTV Telugu

Case File: ముగ్గురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు..

Case File

Case File

Case File: జనగామలో ముగ్గురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కంచె రాములుపై డిసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సుపారీ ప్లాన్ చేశారని కంచే రాములతో పాటు అదే పార్టీకి చెందిన రాగుల శ్రీనివాస్ రెడ్డి డీసీపీకి ఫిర్యాదు చేసారు. 24 గంటల గడవక ముందే యూటర్న్ తీసుకున్నాడు సదరు నాయకుడు శ్రీనివాస్ రెడ్డి. తనకు ఎలాంటి సంబంధం లేదని, సుపారీ ప్లాన్ లో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసాడు శ్రీనివాస్ రెడ్డి.

Jr NTR : సమాజం పట్ల తన వంతు భాద్యతగా ‘దేవర’.. వీడియో రిలీజ్

కంచే రాములు వర్గం శ్రీనివాస్ రెడ్డి మాటలకు సంబంధించిన సీక్రెట్ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కంచే రాములు, వేమల్ల సత్యనారాయణ, ఎర్రమల్ల సుధాకర్ లతో తనకు ప్రాణహాని ఉందని కంచే రాములు బెదిరించి తనతో అబద్ధాలు చెప్పించారని, తనకు తెలియకుండానే సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేశారని జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Mohan Babu : మంచు పెదరాయుడు ఇంట్లో భారీ చోరీ..

Exit mobile version