NTV Telugu Site icon

Nannapuneni Narender : మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌పైన వరంగల్ కేసు నమోదు

Nannapuneni Narender

Nannapuneni Narender

వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరరేందర్ పై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో నవజాత శిశువును రెండు రోజుల క్రితం కుక్కలు పీక్కుతిన్న ఘటనపై మాజీ ఎమ్మెల్యే నరేందర్ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ గేట్ ముందు నిరసన తెలిపారు. అయితే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అధిక సంఖ్యలో జనాలను గుంపులుగా తీసుకెళ్లి హాస్పటల్లోని సిబ్బంది, డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించే విధంగా నిరసన చేపట్టారని మాజీ ఎమ్మెల్యే తో పాటు మరో 9 మందిపై మట్టెవాడ పోలీసులు పోలీసులు కేసు నమోదు చేశారు. . A1గా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, A2గా 34వ డివిజన్ కార్పొరేటర్ కుమారస్వామి, A3గా 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి, A4గా 37 డివిజన్ కార్పొరేటర్ రిజ్వానా షమీమ్, A5గా కొంగరం రాజేందర్, A6గా ఎలగంటి సతీష్ మాజీ దుర్గేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్, A7గా ఎలగంటి మధు, A8గా సీతారాం, A9గా బజ్జూరి వాసు, A10గా తోట స్రవంతిని చేర్చారు.

BJP: “ఇది మోడీ ఇండియా”.. కాంగ్రెస్ నేతల ‘‘బంగ్లాదేశ్’’ వ్యాఖ్యలపై ఫైర్..

Show comments