Site icon NTV Telugu

Shilpa Shetty Raj Kundra: ఇబ్బందుల్లో శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా.. రూ. 60 కోట్లకు మోసం.. కేసు నమోదు

Shilpa Shetty

Shilpa Shetty

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మళ్ళీ ఇబ్బందుల్లో పడ్డారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త రూ.60 కోట్లకు మోసం చేసినట్లు అభియోగాలు మోపారు. వ్యాపారవేత్తను మోసం చేసినందుకు శిల్పా-రాజ్, మరొక వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ కేసు ఈ సెలబ్రిటీ జంటకు చెందిన ప్రస్తుతం పనిచేయని బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం రుణం, పెట్టుబడి ఒప్పందానికి సంబంధించినది. 2015-2023 ప్రాంతంలో వ్యాపార విస్తరణ కోసం దీపక్ కొఠారి తమకు రూ.60.48 కోట్లు ఇచ్చారని, కానీ వారు దానిని వ్యక్తిగత ఖర్చులకు ఖర్చు చేశారని వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఆరోపించారు.

Also Read:Budameru Floods: పొంగి ప్రవహిస్తున్న బుడమేరు.. విజయవాడ నగరవాసులకు టెన్షన్..!

శిల్పా, రాజ్ కలిసి తనను రూ.60 కోట్లకు పైగా మోసం చేశారని వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఆరోపించారని ముంబై పోలీసు అధికారి తెలిపారు. ఇప్పుడు కేసు దర్యాప్తును EOW కి అప్పగించారు. నివేదికల ప్రకారం, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ అయిన జుహు నివాసి దీపక్ కొఠారి (60) ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. రాజ్, శిల్పా చట్టపరమైన ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. ED వారి ఇంటిపై దాడి చేయకముందే. రాజ్‌ను పోర్న్ కేసులో జైలుకు పంపారు. దీనిపై శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా ఇంకా స్పందించలేదు.

Exit mobile version