cheating Case : ముంబై మాజీ మేయర్,శివసేన (యుబీటీ) నాయకురాలు కిషోరీ ఫడ్నేకర్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు చీటింగ్ కేసు పెట్టారు. సబర్బన్ వర్లీలో మహారాష్ట్ర ప్రభుత్వ స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (ఎస్‌ఆర్‌ఏ) ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్‌లను కొనుగోలు చేశారని ఆమెపై ఆరోపణలు వెలువడ్డాయి. గోమాత జనతా ఎస్‌ఆర్‌ఎ సొసైటీలో ఉన్న ఫ్లాట్‌ల కొనుగోలుకు సంబంధించి మోసం,ఫోర్జరీ ఆరోపణలపై ఫడ్నేకర్‌తో పాటు ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ముగ్గురు అధికారులపై శనివారం నమోదైన కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఓ పోలీస్ అధికారి చెప్పారు.
Read Also: Mohan Lal : రోడ్డుపై కాగితాలు ఏరుతున్న సూపర్ స్టార్ మోహన్ లాల్
మాజీ మేయర్ ఫడ్నేకర్ గోమాత సొసైటీలో గంగారామ్ భోగ పేరు మీద ఉన్న ఫ్లాట్‌ను ఆమె కొనుగోలు చేశారని ఎస్‌ఆర్‌ఏ అధికారి ఉదయ్ పింగ్లే తెలిపారు. నిజానికి ఆ ఫ్లాట్‌ను 2008లో భోగాకు కేటాయించారు.2017 ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఫడ్నేకర్ దానిని తనదిగా పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నప్పుడు, 2008లో మరొక వ్యక్తికి కేటాయించిన వాణిజ్య యూనిట్‌ను ప్రైవేట్ సంస్థ కార్యాలయంగా ప్రకటించిందని అధికారి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
Read Also: Retail Inflation : సామాన్యులకు ఊరట.. తగ్గుతున్న ద్రవ్యోల్బణం
SRA నిబంధనలను ఉల్లంఘించి 2017లో మరో యూనిట్‌ను కూడా సంస్థ చేపట్టిందని ఆయన తెలిపారు. కిషోరి ఫడ్నేకర్‌తో పాటు మరో ముగ్గురిపై మోసం, ఇతర నేరాలకు సంబంధించి సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయబడింది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు మరియు విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు.