Site icon NTV Telugu

Health Tips : రోజూ ఇదొక్కటి తింటే చాలు..కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

carrot benefits

carrot benefits

ఈరోజుల్లో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు.. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. ముఖ్యంగా గుండె జబ్బులు కూడా వస్తాయి.. ఒత్తిడి, ఆందోళన, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాలను తీసుకోవాలి… కొవ్వును కరిగించే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో క్యారెట్ మనకు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కంటి చూపును మెరుగుపరిచి, కంటి సమస్యలు రాకుండా చేయడంలో మాత్రమే క్యారెట్ ఉపయోగపడుతుందని అందరూ భావిస్తారు. కానీ క్యారెట్ ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.. క్యారెట్ లో విటమిన్ ఎ, బీటా కెరోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.. క్యారెట్ గుండె జబ్బులను కూడా తగ్గించడం లో క్యారెట్ సహాయ పడుతుంది..

క్యారెట్ లో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. క్యారెట్ ను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా క్యారెట్ ఎంతో సహాయపడుతుంది. క్యారెట్ లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది… ఒక క్యారెట్ తీసుకోవడం ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా రోజు తినడం అలవాటు చేసుకోండి.. ఆ తర్వాత ఫలితాలు ఏంటో మీరే చూడండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version