Site icon NTV Telugu

CM Biren Singh: మణిపూర్లో స్వార్థ ప్రయోజనాలు, విదేశీ కుట్రల కారణంగా మారణకాండ

Birn Sing

Birn Sing

స్వాతంత్ర్య దినోత్సవం రోజున మణిపూర్ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో కొన్ని అపార్థాలు, స్వార్థ ప్రయోజనాలు, విదేశీ కుట్రల కారణంగా మరణకాండ జరిగిందని, ప్రజలు చనిపోయినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పేర్కొన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. మణిపూర్ రైఫిల్స్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హింసను అరికట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని చెప్పారు. హింసకు పాల్పడింది బయటి నుండి వచ్చిన శక్తులేనని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. విలువైన ప్రాణాలు, ఆస్తులను కోల్పోవడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.

Read Also: Viral Video: ఈ తండ్రి కూతురి పుట్టిన రోజు ఎలా చేశాడే తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

బాధిత ప్రజలను త్వరలో పునరావాసం కల్పిస్తామని సీఎం చెప్పారు. చాలా మంది ప్రజలు సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారని ముఖ్యమంత్రి వాపోయారు. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, బాధిత ప్రజలకు త్వరలో పునరావాసం కల్పిస్తామని సింగ్ చెప్పారు. స్వస్థలాలకు తరలించలేని వారిని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లలో తాత్కాలికంగా ఉంచుతామని తెలిపారు. తప్పు చేయడం మానవుని సహజ గుణమని.. క్షమించడం, మరచిపోవడం నేర్చుకోవాలి అని ఆయన చెప్పారు. ఒకే కుటుంబం.. ఒకే జీవనోపాధి అనే ప్రాజెక్టును అందించి ప్రజలకు పునరావాసం కల్పించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు.

Read Also: Game Of Thrones: తెలుగులో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’.. ఆ సీన్స్ ఉంటాయా మాస్టరూ.. ?

మణిపూర్ రాష్ట్రంలో.. షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఈ క్రమంలో మే 3న మణిపూర్‌లో హింస ప్రారంభమైంది. ఆ హింస ఘటనల్లో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3,000 మందికి పైగా గాయపడ్డారు. 60,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులు కాగా.. వేల కోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి.

Exit mobile version