Site icon NTV Telugu

Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లోకి కార్లోస్ ఆల్కారాజ్ ఎంట్రీ..!

Carlos Alcaraz

Carlos Alcaraz

Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్‌ 2025 పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత చాంపియన్ కార్లోస్ ఆల్కారాజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఇటలీ టెన్నిస్ స్టార్ లోరెంజో ముసెట్టికి గాయం కావడంతో ఆల్కారాజ్‌కు వాక్‌ ఓవర్ లభించింది. మ్యాచ్‌ ప్రారంభంలో ఆల్కారాజ్‌కు పోటీగా కనిపించిన ముసెట్టి తొలి సెట్‌ను 6-4తో కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో స్పానిష్ యువ స్టార్ ఆల్కారాజ్ తిరిగి పోటీకి రావడంతో సెట్‌ను టై బ్రేక్‌లో 7-6 (7-3)తో గెలుచుకున్నాడు.

Read Also: SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

ఇక మూడో సెట్ ప్రారంభమైన వెంటనే ఆల్కారాజ్ రెండు గేమ్స్ గెలవగా, ముసెట్టి ఒక్క గేమ్ కూడా గెలవకముందే గాయంతో మ్యాచ్ నుంచి ఉపసంహరించుకున్నాడు. దీంతో ఆల్కారాజ్‌కు వాక్‌ ఓవర్ లభించి ఫైనల్‌ చేరాడు.

Read Also: Muhammad Yunus: రాజకీయ అస్థిరతల మధ్య బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు..!

ఈ విజయంతో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఆల్కారాజ్ మరో అడుగు దూరంలో నిలిచాడు. ప్రస్తుతం అతను ఎవరితో పోటీ పడతాడన్నది మరో సెమీఫైనల్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ పోటీ ఫైనల్లో ఆల్కారాజ్ ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.

Exit mobile version