Site icon NTV Telugu

Cardless Cash Withdrawal at ATM: డెబిట్‌ కార్డ్‌ లేకున్నా.. ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా! ప్రాసెస్ ఇదే

Cardless Cash Withdrawal

Cardless Cash Withdrawal

How to withdraw Cash from ATM Using UPI: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న విషయం తెలిసిందే. దాంతో జనాలు మొత్తం ఆన్‌లైన్ ప్రపంచంలోనే బతికేస్తున్నారు. ఆన్‌లైన్ వచ్చినప్పటి నుంచి చాలా మంది డబ్బును ఇంట్లో దాచుకోవడం లేదు. అవసరమైనప్పుడు బ్యాంకుకు వెళ్లి లేదా డెబిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎమ్‌ నుంచి విత్‌ డ్రా చేసుకుంటున్నారు. ఏటీఎమ్‌ నుంచి డబ్బును విత్‌ డ్రా చేయాలంటే.. డెబిట్‌ కార్డు తప్పనిసరి. అయితే మీరు డెబిట్‌ కార్డ్‌ లేకున్నా.. డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌ సాయంతో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.

మీరు డెబిట్‌ కార్డ్‌ మర్చిపోయినా మొబైల్ ఫోన్‌ సాయంతో ఏటీఎమ్‌ నుంచి డబ్బు తీసుకొనే సదుపాయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా అన్ని ఏటీఎంలలో డెబిట్‌ కార్డ్‌ లేకున్నా డబ్బులు తీసుకోవచ్చు. ఫోన్‌ పే, గూగుల్‌ పే లాంటి యాప్స్‌ ద్వారా.. డెబిట్‌ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. అదెలాగో చుద్దాం.

ఫోన్‌ పే, గూగుల్‌పే లాంటి యూపీఐ యాప్స్‌తో పాటు ఆయా బ్యాంక్‌ యాప్స్‌ ద్వారా కూడా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఎస్‌బీఐ వినియోగదారులైతే ‘యోనో’ యాప్, ఐసీఐసీఐ బ్యాంక్‌ వినియోగదారులైతే ఐమొబైల్‌ యాప్‌ను ఉపయోగించొచ్చు. నెలకు ఒక లక్ష వరకు యూపీఐ ద్వారా ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. రోజువారీ విత్‌డ్రా పరిమితులు కూడా ఉంటాయి.

Also Read: Traffic Alert: ట్రాఫిక్ అలర్ట్.. నేటి నుంచి ఈ నెల 10 వరకు ఆంక్షలు

ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా ప్రాసెస్ (Withdrawal Money From ATM Without Card Process):
# ముందుగా ఏటీఎం యూపీఐ సదుపాయం పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఆపై ఫోన్‌లో ఇంటర్నెట్‌ ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి.

# ఏటీఎం స్క్రీన్‌పై విత్‌డ్రా సెక్షన్‌లో క్యూఆర్‌ క్యాష్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. వెంటనే క్యూఆర్‌ కోడ్‌ జనరేట్‌ అవుతుంది. దీన్ని కేవలం ఒకసారి మాత్రమే వినియోగించుకొవచ్చు.

# ఆపై మీ ఫోన్‌లో యూపీఐ యాప్‌లో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కానర్ ఆప్షన్‌ క్లిక్ చేసి.. ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.

# ఎంత డబ్బు కావాలో ఎంటర్ చేసి.. యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయాలి. చివరగా డబ్బు విత్‌డ్రా అవుతుంది.

Also Read: Yatra-2 Motion Poster: నేను విన్నాను, నేను ఉన్నాను.. యాత్ర-2 మోషన్ పోస్టర్‌ రిలీజ్‌!

Exit mobile version