Site icon NTV Telugu

Cardamon Benefits: రోజుకు రెండంటే.. రెండు చాలు.. ఆరోగ్యమే కాదు.. శృంగార జీవితంలోను..!

Cardamon Benefits

Cardamon Benefits

Cardamon Benefits: యాలకులు ‘జింగీబెరాసెయ్’ జాతికి చెందినవి. ఇవి భారతదేశంతో పాటు భూటాన్, నేపాల్, ఇండొనేషియా వంటి దేశాల్లో వీటిని అధికంగానే పండిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలలో ‘రాణి’గా పిలిచే యాలకులు.. కాస్త ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఈ యాలకులు ప్రధానంగా ఆకుపచ్చ, నలుపు అనే రెండు రకాలు ఉన్నాయి. మనం ఎక్కువగా ఉపయోగించే ఆకుపచ్చ యాలకులు భారత్, మలేసియాలో అధికంగా పండిస్తారు. ఇక దీని ఆరోగ్య ప్రయోజనాలను చూస్తే..

Kurnool Bus Fire Accident: పోలీసుల కీలక ప్రకటన.. వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ!

యాలకుల రుచి, సువాసన మనలో ఉండే టెన్షన్, ఉద్రేకత, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒత్తిడిలో ఉన్నవారు యాలకుల పొడిని టీ లేదా పాలలో వేసుకుని తాగడం ఉత్తమం. యాలకుల గింజలను నేరుగా తిన్నా మంచి ఫలితం ఉంటుంది. డిప్రెషన్ నుండి బయటపడాలంటే కూడా యాలకుల టీ లేదా పాలు తాగడం ఉపశమనాన్ని ఇస్తుంది. బాధలను తట్టుకోలేక నెగెటివ్ ఆలోచనలు, ఆత్మహత్య ప్రయత్నాలు చేసేవారికి యాలకులు మంచి ఉపకారిగా పనిచేస్తాయి.

సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ‘సినియోల్’ (Cineole) అనే సమ్మేళనం పురుషులలో నరాల పటిష్టతకు ఉపయోగపడుతుంది. నరాల బలహీనత, లైంగిక సామర్ధ్యం తక్కువగా ఉన్నవారు రోజూ యాలకులను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ చిటికెడు యాలకుల పొడి వాడినట్లయితే సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో మెటబాలిజాన్ని పెంచే గుణాలు ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలను పోగొడతాయి. పొట్టలో విడుదలయ్యే బైల్ యాసిడ్‌ను యాలకులు క్రమబద్ధీకరిస్తాయి.

WhatsApp Tips: ఇలా చేస్తే వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవచ్చు!

అలాగే కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం లాంటి సమస్యలతో బాధపడేవారు యాలకులను క్రమం తప్పకుండా వాడాలి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఊపిరితిత్తులకు మేలు చేయడంతో కఫాన్ని తగ్గిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల నివారణకు కూడా ఆకుపచ్చ యాలకులను వాడతారు. యాలకుల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఫైబర్ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండెకు రక్త సరఫరా చక్కగా జరిగేలా చూస్తాయి. యాలకులలోని మాంగనీస్ డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తుంది. అలాగే, యాలకులు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా, యాలకుల్లోని సహజ సిద్ధమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్‌ను అడ్డుకోవడం, దాని పెరుగుదలను నెమ్మదింపజేయడం, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని జంతువులపై జరిపిన పరిశోధనల్లో తేలింది.

Exit mobile version